22, సెప్టెంబర్ 2012, శనివారం

రాజకీయాల భారతం: (అ)రాజకీయనాయకులు

రాజకీయాల భారతం: (అ)రాజకీయనాయకులు: ఈ మధ్య ఎవరి నోట విన్నా 'వెధవ' రాజకీయాలనేవారే. రాజకీయ నాయకులు తప్పితే ఎవరు కూడా ప్రస్తుత రాజకీయాలను ఇష్టపడటంలేదు. ఆ రాజకీయ నాయకులు కూడా ఇంకో ...

20, జులై 2011, బుధవారం

పెట్రోల్ ధర మండుతుంది ఎడ్లు కట్టండి

   ప్రపంచం అంతా సబ్సిడీ రహితంగా ఉంటే మనం ఇంకా పాత పద్దతుల్లోనే పోతున్నాం అని చిరాకు పడతారు. పోటీ ప్రపంచంలో సబ్సిడీలేంటని ప్రశ్నిస్తారు. ఇదంతా చూస్తున్న జనాలకు కూడా సిగ్గేసి ఎవడి ముష్టో మనకెందుకు పెంచితే పెంచారులే అనుకుని ముందుకుపోతారు. అలా ఇప్పుడు లీటర్  పెట్రోల్  70 రూపాయల 60 పైసలుకు తీసుకొచ్చారు. మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ లో మాత్రం లీటర్  పెట్రోల్  కేవలం 30 రూపాయలే. బంగ్లాదేశ్ లో అయితే 28 రూపాయలే. నేపాల్ లో 40 బర్మాలో 35 రూపాయలు నడుస్తోంది.

   కమ్యునిస్ట్   క్యూబాలో అయితే లీటర్  పెట్రోల్ కేవలం 22 రూపాయలు మాత్రమే. నిత్య ఆందోళనల ఆఫ్ఘనిస్తాన్ లో కూడా లీటరు పెట్రోల్  44 రూపాయలే. కతార్ లో 36 రూపాయలు. ఇదంతా చూస్తుంటే మన పాలకుల మీద కోపం రావడం లేదూ. ఇప్పుడు అసలు విషయం చూద్దాం. అంతర్జాతీయ క్రూటాయిల్  ధరలు అంటూ మాట్లాడుతుంటారు కదా...అసలు లీటర్  పెట్రోల్  సరఫరా ధర లీటర్ కు 20 రూపాయల యాభై పైసలు. దీని మీద కేంద్ర పన్ను 13రూపాయలు. ఎక్సైజ్  డ్యూటీ 10 రూపాయల డెభై అయిదు పైసలు. రాష్ట్ర పన్నులు 15రూపాయలు. వాట్  ఆరు రూపాయల ముఫై పైసలు. వెరసి 71రూపాయల అరవై పైసలు. మనకు సరఫరా అవుతున్న పెట్రోల్  మీద లీటర్ కు మూడున్నర రెట్లు అధిక ధరకు మనకు అందిస్తున్నారన్నమాట. ఈ పన్నులు, సెస్ లు తగ్గించుకోగలిగితే సగం తగ్గించుకున్నా పెట్రోల్  దర సామాన్యుడికి ఇంత భారం అవదు.

  ప్రతిపక్షాలు కూడా పెట్రోల్ ధరలు తగ్గించాలని ఆందోళనలు మాని నిర్దిష్టంగా ప్రభుత్వం పెట్రోల్  మీద విధిస్తున్న పన్నుల విధానాన్ని రద్దు చేయాలని ఆందోలనలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. జనం పెరిగిన ధరలకు అలవాటు పడే దాకా ఆందోళనలు చేసి విరమించడం కాకుండా పన్నుల విధానాన్ని శాస్త్రీయంగా మదింపు వేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగితే ప్రజలకు మేలు చేసిన వాళ్లవుతారు.-hmtv సౌజన్యంతో

నా వ్యాఖ్య : పెట్రోల్ పూల్ ని తొలగించి పుణ్యం కట్టుకుంది బి జే పి.  సందు దొరికింది కాబట్టి ఏనుగునే దూర్చేస్తాం అంటూ కాంగ్రెస్ అనగా యుపిఏ సర్కార్. పన్నులను తగ్గించాలని మొదటి నుండి పట్టు పట్టింది మార్క్సిస్టు పార్టీ మాత్రమె. మార్క్సిస్టు నాయకులు ఎప్పుడో దీన్ని గురించి రాసారు. పార్లమెంటులో ప్రజల పక్షాన నిలబడే పార్టీ ని ఓడించి, కంపెనీలు చెప్పినట్లు ఆడే పార్టీలకు అధికారం కట్ట పెడితే పరిస్థితులు ఇలా నే ఉంటాయి మరి.

26, జూన్ 2011, ఆదివారం

రాజకీయాల భారతం: హొషియార్ !!

రాజకీయాల భారతం: హొషియార్ !!: "కంచే చేను మేస్తున్నదా, చేనే కంచని పెంచి పోషిస్తున్నదా? ఈ యక్ష ప్రశ్న కి సమాధానం తెలిసి చెప్పక పోయారో మీ తలలు వేయి వక్కలైపోవు కాని, అవినీత..."

25, జూన్ 2011, శనివారం

హొషియార్ !!


కంచే చేను మేస్తున్నదా, చేనే కంచని పెంచి పోషిస్తున్నదా? ఈ యక్ష ప్రశ్న కి సమాధానం తెలిసి చెప్పక పోయారో మీ తలలు వేయి వక్కలైపోవు కాని, అవినీతి బురదలో పీకల్లోతుకు కూరుకు పోతారని శపిస్తున్నాను.

సరే ఈ సమాధానం కోసం మీరాలోచిస్తుండండి, ఈలోగా మీ ఆలోచన పదునెక్కడానికి ఒక చిన్న కధ చెబుతాను. మీకు తెలిసిన కధే, అయినా ఎందుకో చెప్పాలని పిస్తున్నది.

ఒక అడవిలో ఒక చెరువున్నదిట. ఆ చెరువులో చేపలు ఆడుతూ పాడుతూ కాలం గడిపేవట.  ఎండాకాలం కూడా ఎండిపోని ఆ చెరువును చూసి ఓ కొంగ రొట్టలేసుకంటూ తన టికానాని అక్కడికి మార్చేసింది.  ఇంకేముంది పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్, మధ్యాన్నం లంచి, రాత్రికి డిన్నర్. ఎక్కువ శ్రమ పడకుండా తన బొజ్జ నింపుకోవటం మొదలు పెట్టిందా కొంగ. 

రోజురోజు కి తగ్గిపోతున్న తమ చాపల సంఖ్యని చూసి,  ముఖ్యంగా పసి చేపల తరుగుదల చూసి, జరుగుతున్న విషయాన్ని గమనించిన పెద్ద చేపలు, తమ సంతతిని ఆ కొంగ జోలికి పోకుండా కాపలా కాయటం మొదలు పెట్టయట .

కొంగకి రెండు రోజులు ఆహారం దొరకలేదు. ఏమయిందబ్బా, నిన్నటి దాకా నా ముక్కు దగ్గరకొచ్చి నన్ను శ్రమ పెట్టకుండా ఆహారాన్ని అందించిన చేపలు, రెండు రోజులుగా ఒక్కటి కూడా కను చూపు మేరలో కనిపించటంలేదు అంటూ వాపోయింది. కిం కర్తవ్యం అంటూ ఆలోచించిది.

అలా ఆలోచిస్తున్న కొంగ కి పొరపాటున దారి తప్పి వచ్చిన ఓ చిన్నారి చేప పిల్ల కనిపించిది. కొంగ ని చూడగానే అది చలి జ్వరం వచ్చి నట్లు వాణక సాగింది.   వెంటనే కొంగ చేపని పిలిచి ఎందుకు నన్ను చూసి అలా వణికి పోతున్నావు. నేను ఇదివరకిటి కొంగ ని కాదు.  సంన్యాసం తీసుకున్నాను. ఏదో ఆకులు అలములు తప్ప, చేపల జోలికి పోను. నన్ను నమ్ము. రండి, ఈ రోజు నుండి మనం కలసి ఆడుకుం దాము. 

కొంగ దగ్గరకి పోయి ప్రాణాలతో తిరిగి వచ్చిన చిన్న చేపని చూసి పెద్ద చాపలు సంతోషించటమే  కాక కొంగ లో దైవత్వాన్ని చూశాయి. ఆ రోజు నుండి నిర్భయంగా కొంగ చుట్టూ దొంగా పోలీస్ ఆట ఆడుకుంటూ కాలం గడప సాగినాయి. కాని దొంగ సన్యాసి కొంగ,  దొంగ చాటుగా  ఒక్కొక్క చాపని కృష్ణార్పణం చేయటం మొదలు పెట్టింది, మిగతా చాపలకి అనుమానం రాకుండా.

ఈ కధంతా మీరెప్పుడో  చడ్డీలు తొడుక్కొని  జీడీలు చీక్కొనే రోజుల్లోనే విన్నారని నాకు తెల్సు. తెల్సినా ఎందుకు చెబుతున్నవంటారా? 

గత కొద్ది రోజులుగా  జరుగుతున్న వ్యవహారాలని చూస్తుంటే ఎందుకో ఈ కధ చెప్పాలనిపించింది.  పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలకి ఎజమాని, తన ఫాక్టరీలో కార్మికులకు సరిగా వేతనాలివ్వని పెట్టుబడిదారుడు, స్కాట్ లాండో ఎక్కడో ఓ  ఐ లాండు కి అధిపతి ఐన ఓ సన్యాసి, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాదుట. రాజకీయ నాయకులను దగ్గరగా రానివ్వనంటూ హటం వేసిన హజారే, ఆ  సన్యాసికి, రాజకీయ పార్టీ పెడతానంటూ గడ్డం మెలేసే పెద్ద మనిషికి,  పెద్ద పత్తిత్తుల్లా    బి జే  పి వాళ్ళు  కౌగిలించు కుంటున్నా  సమర్ధించటం  చూస్తుంటే ఏమనుకోవాలి.

అదటు వుంచితే ఇక పుట్టపర్తి బాబా సంగతి యేమని చెప్పాలి.  ఓ దేవుడి సన్నిధి లోనే దోపిడీ దారులు రాజ్యమేలారని చెప్పాలా? లేక దేవుడే వారిని పెంచి పోషించారని  చెప్పాలా? అమ్మో ఇలా అంటున్నానేమిటి? నా కళ్ళు పోవు?

ఇవన్నీ చూసినా ప్రజలు దొంగ సన్యాసులని నమ్ముతూనే ఉంటాం మరి. రాజ్యాలనేలే ప్రధానులు మొదలు పెద్ద పదవులెలగ పెడుతున్న వాళ్ళందరూ, పాదాలమీద పడి మరీ సన్యాలుసులకు పాదాభివందనం చేస్తుంటే, పవిత్రమైన పుట్టపర్తి రాగానే విమానంలోనే వినయంగా సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటే,  వేలిముద్ర గాళ్ళం, నమ్మక చస్తామా  మరి.

దొంగ తపస్సులు చేసే కొంగలూ వుంటాయి. అటువంటి కొంగలని ఆశ్రయించుకొని మండ్రుగబ్బలు,  నీటి పాములు అవకాశం కోసరం ఆరాట పడుతుంటాయని ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నది. అందుకే అంటున్నా, బాబాలతో  హోషియార్, జాగ్తే రహొ.

==========

8, అక్టోబర్ 2010, శుక్రవారం

(అ)రాజకీయనాయకులు

ఈ మధ్య ఎవరి నోట విన్నా 'వెధవ' రాజకీయాలనేవారే. రాజకీయ నాయకులు తప్పితే ఎవరు కూడా ప్రస్తుత రాజకీయాలను ఇష్టపడటంలేదు. ఆ రాజకీయ నాయకులు కూడా ఇంకో పార్టీ లోకి మారినప్పుడు, తను అప్పటిదాకా ఎలోచ్చిన పార్టీ రాజకీయాలు కూడా నచ్చవు. ఇప్పుడు వేరే పార్టీ లోకి వచ్చి పవిత్రుడైపోయినట్లు మాట్లాడుతారు.

ఏదో కారణం చేత పార్టీ నుండి బహిష్కరించపడినట్లయితే, అప్పటిదాకా తాను నమ్మిన సిద్దాంతాన్ని కూడా లెక్క చేయకుండా, పార్టీ మీద, పార్టీ నాయకుల మీద బురద పోస్తారు. బురద కాని దొరకకపోయిండా, వేరే నాయకుల దగ్గరనుండి బురదని అరువుతెచ్చుకోనైనా పోయడానికి సిద్ధ పడతారు. తను నమ్మిన సిద్ధాంతాలను వదిలేసి, అప్పటిదాకా శత్రువుగా భావించిన వాళ్ళ ఎదుట ఎంచక్కా భజన చేయటానికి సిద్ద పడతారు.

ప్రజలు 'ఛీ' 'ఛా' అన్నా, పనిలేని, పనికి రాని పరమ సున్టలన్నా, తమ పని తాము కానిచ్చుకుని పోతూనే ఉంటారు. ప్రజలతో వాళ్ళకేమి పని, మరో ఎన్నికల దాకా. మీజోలికి మేము రాము, మా జోలికి మీరు రావద్దంటారు.

ప్రజలు బుద్ధిగా వాళ్ళు చెప్పిన మాటలు సరదాగా వింటారు. పాపం, ఎన్నికలప్పుడు పెట్టిన ఖర్చు ఎలా వస్తుందని, రాజకీయ నాయకులపైనే జాలి చూపిస్తారు. ఎలక్షన్లప్పుడు తీసుకున్న దానికి కృతజ్ఞత చూపిస్తారు.

రాజకీయాలను ఎవగించుకుంటూనే, రాజకీయాలు అలా మారటానికి కేటలిస్టులు గా పని చేయటాని కి ఇష్టపడుతుంటారు.

ప్రస్తుత రాజకీయాలను మారుద్దమనుకునే వాళ్ళని మాత్రం పిచివాళ్ళ లాగా చూస్తూ, మీరు గెలిచినా వాడినా ప్రజలకోసం పని చేస్తుంటారు కాబట్టి, ఆ చేసే పనేదో బైటే వుండి చేయమని వాళ్ళని తుక్కు తుక్కుగా వోడిస్తారు.

ప్రత్యామ్నాయ రాజకీయాలు మనకెందుకు. గానుగేద్దుల్ల మనం ఆ సాంప్రదాయ పార్టీల చుట్టే తిరుగుదాము. మనలో వున్నా చివరి రక్తపు బొట్టు వరకు మన (అ) రాజకీయనాయకుల అబివ్రుద్దికే దారపోద్దము.